సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 మే 2018 (10:18 IST)

లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడి పెళ్లి.. గిఫ్ట్ ఐటమ్స్‌ను దోచేశారు..

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడి పెళ్లి అట్టహాసంగా జరిగింది. కానీ లాలూ పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదప్ వివాహంలో కొందరు ఆహార పదార్థాలను టపాసులతోపాటు వీఐపీలు, మీడియా ప్రతినిధులకు ఇచ్చేందుక

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడి పెళ్లి అట్టహాసంగా జరిగింది. కానీ లాలూ పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదప్ వివాహంలో కొందరు ఆహార పదార్థాలను టపాసులతోపాటు వీఐపీలు, మీడియా ప్రతినిధులకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన గిఫ్ట్ ఐటమ్స్‌ను లూటీ చేశారు.
 
తేజ్‌ప్రతాప్-ఐశ్వర్య దండలు మార్చుకున్న వెంటనే ఆర్జేడీ కార్యకర్తలుగా చెబుతున్న కొందరు అట్టపెట్టెలను చింపేసి అందులోని వస్తువులను లూటీ చేయడం ప్రారంభించారు. వెంటనే రంగంలోకి దిగిన పార్టీ నేతలు కర్రలు పట్టుకుని దుండగులను వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. 
 
దుండగులు తమపై దాడిచేసి కెమెరాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారని మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏడువేల మందికిపైగా హాజరైన ఈ పెళ్లికి భారీ ఏర్పాట్లు జరిగిన భద్రత మాత్రం లోపించింది.