మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (10:49 IST)

నందమూరి ఇంట సందడి చేసిన మెగా హీరో దంపతులు

ఇటీవ‌లి కాలంలో నంద‌మూరి హీరో ఎన్టీఆర్‌, మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీస్ మ‌ధ్య సంబంధ బాంధవ్యాలు బాగా బలపడుతున్నాయి. క్రమం తప్పకుండా క‌లుస్తున్న ఈ రెండు ఫ్యామిలీస్ ఫోటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో షే

ఇటీవ‌లి కాలంలో నంద‌మూరి హీరో ఎన్టీఆర్‌, మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీస్ మ‌ధ్య సంబంధ బాంధవ్యాలు బాగా బలపడుతున్నాయి. క్రమం తప్పకుండా క‌లుస్తున్న ఈ రెండు ఫ్యామిలీస్ ఫోటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి చూసిన ఫ్యాన్స్‌కి ఆనందం అవ‌ధులు దాటుతుంది.
 
ఈ నేపథ్యంలో శనివారం జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌ణ‌తి పెళ్లి రోజు. దీన్ని పురస్కరించుకుని మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న వైఫ్ ఉపాస‌న... ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి కేక్ క‌ట్ చేయించారు. అంతేకాదండోయ్... గ్రూఫ్ ఫోటోకి కూడా ఫోజులిచ్చారు. ఉపాస‌న ఫ్యామిలీ పిక్‌ని త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. 
 
ఇక ఉపాస‌న కొద్ది సేపు హీరో ఎన్టీఆర్ ముద్దుల తనయుడు అభ‌య్‌తో ఆట‌లాడింది. "నాన్న‌కు ప్రేమ‌తో" చిత్రంలోని ఫాలోఫాలో యూ సాంగ్‌ని అభ‌య్ చేత పాడించి ఆ వీడియోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో కూడా వైర‌ల్ అవుతుంది. త్వ‌ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.