మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 మే 2018 (10:39 IST)

ట్రెండ్ మార్చిన మాటల మాంత్రికుడు.. ఫ్యాక్షన్‌పై దృష్టిపెట్టాడు...

టాలీవుడ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకపుడు సినీ రచయిత. ఇపుడు టాలీవుడ్‍లో ఉండే అగ్ర దర్శకుల్లో ఒకరు. త్రివిక్రమ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం షూటిం

టాలీవుడ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకపుడు సినీ రచయిత. ఇపుడు టాలీవుడ్‍లో ఉండే అగ్ర దర్శకుల్లో ఒకరు. త్రివిక్రమ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది.
 
ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్‌ను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు యాక్షన్.. ఎమోషన్.. కామెడీ కలయికతో కూడినవిగా ఉంటాయి. ఈ సినిమాలో యాక్షన్ అనేది ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడినదిగా ఉంటుందనేది తాజా సమాచారం.
 
ఇందులో జగపతిబాబు.. నాగేంద్రబాబు ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తారట. రెండు కుటుంబాల మధ్య సాగే ఫ్యాక్షన్ పోరుగా ఈ సినిమా ఉంటుందన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్‍నే కాదు.. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, దసరాకి సందడి చేసేందుకు ప్రేక్షకుల ముందుకురానున్నాడు.