మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 2 మే 2018 (15:35 IST)

మే 8న సోనమ్ కపూర్ వివాహం.. ప్రైవేట్ సెర్మనీగా...

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ వివాహానికి రంగం సిద్ధం అవుతోంది. మే 8, 2018న ముంబైలో సోనమ్ కపూర్-ఆనంద్ ఆహుజా వివాహం జరుగబోతోందని కపూర్ ఫ్యామిలీ ప్రకటించనుంది. తమ కుటుంబంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌ను ప్

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ వివాహానికి రంగం సిద్ధం అవుతోంది. మే 8, 2018న ముంబైలో సోనమ్ కపూర్-ఆనంద్ ఆహుజా వివాహం జరుగబోతోందని కపూర్ ఫ్యామిలీ ప్రకటించనుంది. తమ కుటుంబంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌ను ప్రైవేట్ సెర్మనీగా జరుపుకోనున్నామని.. తమ ప్రైవసీకి ఎవ్వరూ భంగం కలిగించవద్దునని కపూర్ ఫ్యామిలీ ఫ్యాన్స్‌ను విజ్ఞప్తి చేసింది. 
 
ఇప్పటికే సోనమ్ కపూర్ వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తమ కుమార్తె పెళ్లిని అనిల్ కపూర్ దంపతులు ప్రత్యేకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకలో కపూర్ ఫ్యామిలీతో పాటు ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయబోతున్నారు.
 
సోనమ్ పెళ్లాడబోతున్న ఆనంద్ ఆహుజా ఢిల్లీకి చెందిన వ్యాపారి కుమారుడు. నాలుగేళ్ల క్రితం ఓ స్నేహితుడిగా పరిచయమైన ఆనంద్.. ముందుగా సోనమ్‌కు ప్రపోజ్ చేశాడని.. సోనమ్ మాత్రం కొన్ని నెలల క్రితమే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.