బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:54 IST)

ఆ జంట నిండు నూరేళ్లూ జీవించాలి : ఐఏఎస్ టాపర్స్‌కు రాహుల్ శుభాకాంక్షలు

ఇటీవల మతాంతర వివాహం చేసుకున్న ఓ యువ జంటను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. ఈ జంట నిర్ణయం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

ఇటీవల మతాంతర వివాహం చేసుకున్న ఓ యువ జంటను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. ఈ జంట నిర్ణయం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. 
 
దళిత సామాజికవర్గానికి చెందిన టీనా దబీ అనే 24 ఏళ్ల యువతి 2015లో ఐఏఎస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి వార్తల్లో నిలిచింది. అదే పరీక్షలో అథర్ అమిర్‌ ఉల్ షఫీ (25) అనే యువకుడు రెండో ర్యాంక్ సాధించాడు. షఫీ కాశ్మీర్‌కు చెందిన యువకుడు. 
 
వీరిద్దరూ ఢిల్లీలోని కేంద్రసిబ్బంది శిక్షణా సంస్థలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ప్రేమలో పడ్డారు. మొదట వీరి ప్రేమపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోని టీనా - షఫీ ఇటీవల పెద్దల సమక్షంలో దక్షిణ కాశ్మీర్‌లో ఒక్కటయ్యారు. 
 
ఈ జంటకు రాహుల్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "వారి ప్రేమబంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అసహనం, విద్వేషం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నానని, గాడ్‌ బ్లెస్‌ యూ" అని రాహుల్‌ పేర్కొన్నారు.