శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (08:54 IST)

ఎన్నికల ఫలితాలు.. పియానో వాయిస్తూ గడిపిన మమత బెనర్జీ (వీడియో)

ఎన్నికల ఫలితాలు రానున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పియానో వాయిస్తూ సేద తీరారు. సభలు, సమావేశాలు, సంప్రదింపులు, రాజకీయ వ్యూహాలతో కూడిన బిజీ లైఫ్ నుంచి ఎన్నికల ఫలితాలకు ముందు దొరికిన కాస్త విరామంలో విశ్రాంతి తీసుకునేందుకు ఠాగూర్ పాటల నుంచి ఓ ట్యూన్‌ను పియానోపై వాయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ పాటను మాత, మాతృభూమి, ప్రజలకు అంకితం చేస్తున్నానని కామెంట్ పెట్టారు. 
 
ఇదిలా వుంటే ఎన్నికల ఫలితాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షాలు 100 స్థానాల ఆధిక్యంలో ఉన్నాయి. వాటిలో బీజేపీ 93 స్థానాలు ఆధిక్యంలో ఉంది. అటు యూపీఏ పక్షాలు 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 22 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ రకంగా చూస్తే... మరోసారి బీజేపీ లేదా ఎన్డీయే పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.