శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:08 IST)

మౌనం చెవుడుతో సమానం... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ద్వేష రాజకీయాలు

pmmodi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీకి బ్యూరోక్రాట్ల నుంచి సెగ తగిలింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో ద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, వాటికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలంటూ ప్రధాని మోడీకి మాజీ బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఘాటైన పదజాలాన్ని కూడా వారు ఉపయోగించారు. 
 
మౌనం చెవుడుతో సమానం అంటూ గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఈ తరహా పాలన రాజ్యాంగ నైతికతకు ప్రమాదమని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను దాదాపు వంద మంది బ్యూరోక్రాట్లు (అఖిల భారత సర్వీసుల మాజీ అధికారులు) రాశారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
"మనం ఎదుర్కొంటున్న ముప్పు అసాధారణమైనది. రాజ్యాంగ నైతికత, ప్రవర్తన ప్రమాదంలో పడింది. ఇది మన సామాజిక విశిష్టత. గొప్ప నాగరికత. వారసత్వం. రాజ్యాంగ పరిరక్షణకు రూపొందించబడినది. ఇది చీలిపోయే ప్రమాదం నెలకొంది. ఈ అపారమైన సామాజిక ముప్పు విషయంలో మీరు పాటిస్తున్న మౌనం చెవుడుతో సమానం" అని ఆ లేఖలో పేర్కొన్నారు.