1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 21 జులై 2018 (12:32 IST)

కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? 24న రాష్ట్ర బంద్ : జగన్ ప్రకటన

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీలు కలిసి చేసిన మోసానికి నిరసనగా వైపాకా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బ

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీలు కలిసి చేసిన మోసానికి నిరసనగా వైపాకా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు అందరం ఒకే వేదిక ద్వారా దీక్ష చేస్తే.. కేంద్రం కదిలి వస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే మా పార్టీ ఏకైక డిమాండ్ అని.. హోదా ఇచ్చే పార్టీలకే కేంద్రంలో మద్దతు ఇస్తామని ప్రకటించారు. 
 
ఇకపోతే, నాలుగేళ్లుగా మేము మాట్లాడిన మాటలే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో చెప్పారన్నారు. నాలుగేళ్లుగా మేము చెబుతుంటే మమ్మల్ని వెక్కిరించినోళ్లే.. ఇప్పుడు అవే మాటలను వినిపిస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? అన్నారు. 
 
హోదా ఏమన్నా సంజీవనా అన్నారు.. హోదాకు రాయితీలకు సంబంధం లేదని మహానాడులో తీర్మానం చేసిన విషయాలను గుర్తు చేశారు. ఉనికికోసం ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని పదేపదే పొగిడిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని.. టీడీపీకి గుణపాఠం చెప్పేరోజులు దగ్గరల్లోనే ఉన్నాయని జగన్ జోస్యం చెప్పారు.