గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (11:38 IST)

అలేఖ్య పుట్టినరోజు వేడుకలో వైఎస్ షర్మిల.. ఆమె ఎంతో స్పెషల్ అంటూ.. (Video)

Tarakaratna's wife
Tarakaratna's wife
నటుడు తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. తాజాగా ఆమె పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొనడం విశేషం. 
 
వైఎస్ షర్మిల దగ్గరుండి అలేఖ్య బర్త్ డేని సెలబ్రేట్ చేసింది. షర్మిల అలేఖ్యకు అక్క వరుస అవుతుంది. తాజాగా అలేఖ్య తన పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ వీడియోని షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో అలేఖ్య ఎమోషనల్ అవ్వగా షర్మిల దగ్గరకు తీసుకొని హత్తుకుంది. 
 
గత కొన్నేళ్ల పాటు తనకు అండగా వుంటానని చేసిన ప్రామిస్‌ను నిలబెట్టుకున్నావ్. తన కోసం టైమ్ స్పెండ్ చేసినందుకు థ్యాంక్స్. షర్మిలక్క స్థానాన్ని ఎవరూ రీ ప్లేస్ చేయలేరు. 
 
షర్మిలక్క ఏ పనిచేసినా బ్లెసింగ్‌లా అనిపిస్తుందని.. తను ఎంతో స్పెషల్ అంటూ అలేఖ్య సోషల్ మీడియాలో పేర్కొంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.