శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2020
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:23 IST)

జీఎస్టీతో మంచే జరిగింది.. ఆదాయం పెరిగింది.. నిర్మలా సీతారామన్

జీఎస్టీపై దేశంలో గతంలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో.. అదే జీఎస్టీతో దేశానికి మంచే జరిగిందని.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రం ఆదాయం పెరిగింది. ఎవరికీ నష్టం కలగలేదని చెప్పారు. ఒకే పన్ను, ఒకే దేశ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పుకొచ్చారు. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని, కేంద్ర ఖజానాకు చేరుతున్న ఆ నిధులన్నీ, తిరిగి ప్రజోపయోగ సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 
 
దార్శనికులైన అరుణ్ జైట్లీకి నివాళులు అర్పిస్తున్నామని నిర్మల పేర్కొన్నారు. ఇక ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్ వుంటుందన్నారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే దీక్షతోనే ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా వున్నాయని చెప్పుకొచ్చారు. 
 
గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో కోరుకున్నారన్నారు.  ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి తామంతా పని చేస్తున్నామని తెలిపారు.