Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడకగదికి లేత నీలి రంగు పెయింట్ వేస్తే.. దంపతుల మధ్య?

ఇంటికి వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులను వేయడం ద్వారా సానుకూల ఫలితాలుంటాయి. భవనం గోడలకు వాస్తు రంగులను ఉపయోగించడం ద్వారా ఆ ఇంట నివసించే వారికి, బయటి నుంచి చూసేవారికి అనుకూల ఫలితాలుంటాయి. వాస్తు రంగుల ద

Written By Selvi
Updated: మంగళవారం, 4 జులై 2017 (13:45 IST)
ఇంటికి వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులను వేయడం ద్వారా సానుకూల ఫలితాలుంటాయి. భవనం గోడలకు వాస్తు రంగులను ఉపయోగించడం ద్వారా ఆ ఇంట నివసించే వారికి, బయటి నుంచి చూసేవారికి అనుకూల ఫలితాలుంటాయి. వాస్తు రంగుల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓ భవనానికి వెలుపల, లోపల వాస్తు ప్రకారం ఈ రంగులను ఉపయోగిస్తే.. ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.  
 
భవనానికి వెలుపులి గోడలకు తెలుపు లేదా లేత పసుపు రంగును ఉపయోగించవచ్చు. హాలుకు ఆఫ్ వైట్ కలర్ ఉపయోగించాలి. ఇక ఇంట్లోని పడకగదికి లేత నీలిరంగులను ఉపయోగించడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యతకు లోటుండదు. ఆగ్నేయ దిశలో పడకగది ఉన్నట్లైతే.. లేత ఆకుపచ్చ రంగును వేయడం ద్వారా దంపతుల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకోవు. 
 
అయితే లేత ఆకుపచ్చరంగుతో కూడిన పెయింట్‌ను తూర్పు వైపునున్న పడకగదులకు ఉపయోగించకూడదు. అలాగే లేత నీలి రంగులను పడకగదికి ఉపయోగించడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒంటి నొప్పులు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య జగడాలకు తావుండదు. నీలి రంగు ఆకాశానికి, నీటికి ప్రతీక కావడంతో భాగస్వాముల మధ్య నిజాయితీ, దాపరికం లేని జీవితాన్ని పెంపొందింపజేస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

సెయూటాకు వలసదారులు.. తొక్కిసలాట 67మంది మృతి.. ఈదుకుంటూ వచ్చేస్తున్నారు..

సోదరీమణులారా... నా గుండెను కదిలించారమ్మా: సీఎం చంద్రబాబు వీడియో షేర్

Chandrababu Naidu పవర్‌ఫుల్ స్పీచ్, మోడీజీతోనే ప్రపంచంలో భారత్ నెం.1, Video

కేరళలో కుమ్మేస్తున్న వర్షాలు.. ఐదుగురు మృతి.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

తిరుమలలో చైన్ స్నాచర్.. మహిళా భక్తురాలు బంగారు గొలుసును లాక్కెళ్లాడు..

అన్నీ చూడండి

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...

01-08-2026 నుంచి 31-08-2026 వరకు ఆగస్టు మాస ఫలితాలు

Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...

తర్వాతి కథనం
Show comments