Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వ్యాపారం బాగా రాణించాలంటే?

Written By సిహెచ్
Updated: గురువారం, 5 డిశెంబరు 2019 (22:10 IST)
వ్యాపార సంస్థల నిర్మాణాలకు వాస్తు సరిగా లేకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం షాపుల యొక్క యజమానుల గృహములను వాస్తు బాగుండి, బాగులేదు అనే విషయమును పక్కనబెట్టి, వాస్తు పరంగా షాపు గురించి చర్చిస్తే, షాపుకు వాస్తు సరిగా లేకపోతే వ్యాపారం జరుగదు, లేదా మందకొడిగా జరుగుతుంది. 
 
అప్పులపాలు కావడం, అప్పులు, సరుకులు ఇచ్చిన ఆసామి డబ్బు కట్టమని నెత్తిమీద కూర్చోవడం, ఇతరులకు పూచీలు పడి చేయని పాపానికి మీరు డబ్బు కట్టడం, కొట్లాటలు, అప్పు ఇచ్చిన ఆర్థిక సంస్థల నుండి నోటీసులు రావడం, కోర్టులో కేసులు వేయడం, ప్రభుత్వ సంస్థల నుండి అధికారులు తనిఖీలకు వచ్చి బాగా ఇబ్బంది పెట్టడం, జరిమానాలు వేయడం, షాపు సీజ్ కావడం, అవమానం ఇతరత్రా ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల దిగువ తెలిపిన విధంగా వుంటే సరిపోతుంది.
 
షాపు యజమాని రోజూ పూజ చేస్తుంటాడు. అలాంటప్పడు దేవుడిని వాయువ్యము భాగములో పశ్చిమ గోడకు ఆనుకొని చెక్క పలక వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు.
 
యజమాని కూర్చున్న ప్రక్కనే దక్షిణము వైపుగా పశ్చిమ గోడను ఆనుకొని బీరువాను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బీరువా ఉత్తరమును చూసినచో మంచి ఫలితములను ఇచ్చును. తూర్పు చూచిన ఏ దోషమూ లేదు.
 
షాపు బయట ఉత్తర ఈశాన్యము కోల్పోకుండా కనీసం రెండు అడుగుల అరుగును వేసుకొని, అరుగు పక్కగా మెట్లను వేసుకోవాలి. అయితే షాపు యందలి ఫ్లోరింగ్ కన్నా బయటి అరుగు ఫ్లోరింగ్ పల్లముగా ఉండాలి.
 
యజమాని వాయువ్యములో బల్లవేసుకొని తూర్పుకు చూస్తూ కూర్చోవాలి. మీకు అవసరమనుకుంటే ఉత్తరమునకు కూడా చూస్తూ కూర్చోవచ్చు. దక్షిణ గోడకు మొత్తం ఆనుకొని బలమైన ఒక అరుగును నిర్మించుకోవడం మంచిది. ఈ విధానము చాలా గొప్ప ఫలితములను ఇస్తూ ఉన్నది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments