1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
  4. Curry leaves rasam recipe

తెల్లరక్త కణాలను బలపరిచే కరివేపాకు రసం

Curry leaves rasam
Curry leaves rasam
కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. అలాంటి కరివేపాకుతో రసం తయారు చేస్తే ఎలా వుంటుందో చూద్దాం. కరివేపాకు రసం తెల్ల రక్త కణాలను బలపరుస్తుంది. ఈ రసాన్ని సూప్‌గా కూడా తాగవచ్చు.
 
కరివేపాకు రసానికి కావలసిన పదార్థాలు - కరివేపాకు - ఒక కప్పు, పసుపు - 3 టీస్పూన్లు, మిరియాలు, జీలకర్ర - ఒక్కొక్క టీస్పూన్, చింతపండు - ఒక చిన్న బంతి, పసుపు పొడి - అర టీస్పూన్, నెయ్యి - కొద్దిగా, ఆవాలు, ఉప్పు - అవసరం.
 
తయారీ విధానం: 
కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, జీలకర్రను పేస్ట్‌గా రుబ్బుకోవాలి. చింతపండును రెండు కప్పుల నీటిలో కరిగించి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని బాణలి వేడయ్యాక పోపు పెట్టి రసంలా రెడీ అయ్యాక దించేయాలి. అంతే కరివేపాకు రసం రెడీ.
About Writer
సెల్వి