ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (11:55 IST)

మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా చేస్తే...

Curd Idli
Curd Idli
మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా చేయడం అందరికీ తెలిసిందే. అలాగే పెరుగు ఇడ్లీని తయారు చేసుకుంటే టేస్టు బాగుంటుంది.
 
కావలసిన పదార్థాలు : ఇడ్లీ - 6, 
తాజా పెరుగు - 3 టేబుల్ స్పూన్లు, 
కారం పొడి - అర టేబుల్ స్పూన్, 
జీలకర్ర పొడి - అర టేబుల్ స్పూన్, 
దానిమ్మ గింజలు - కొన్ని 
కొత్తిమీర ఆకులు - కొన్ని. 
ఉప్పు - తగినంత
 
గ్రైండ్ చేసుకునేందుకు: 
తురిమిన కొబ్బరి - 3 టేబుల్ స్పూన్లు,
పచ్చిమిర్చి - 4, జీడిపప్పు - 6. 
 
తాళింపు కోసం: ఆవాలు - అర టీస్పూన్,
ఇంగువ - అర టీస్పూన్, 
కరివేపాకు - కొద్దిగా, 
నూనె - 1 టీస్పూన్. 
 
తయారీ విధానం: పెరుగును ఓ బౌల్‌లోకి తీసుకోండి. కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి మసాలాను పెరుగుతో కలపాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, కరివేపాకు, మెంతికూర వేసి పెరుగులో కలపాలి.
 
వడ్డించేటప్పుడు, ఇడ్లీలను గిన్నెలలో వేసి, దానిపై పెరుగు పోసి, కొత్తిమీర తరుగు, దానిమ్మ గింజలు, కారం పొడి, జీలకర్ర పొడిని చల్లుకుంటే సరిపోతుంది. సూపర్ పెరుగు ఇడ్లీ రెడీ. లేదా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేయండి.