భార్య అంటే అంత చులకనా...? భర్తను ఎందుకలా తిడుతారు...?

సమాజంలో వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. భార్యభర్తల మధ్య పాగా వేస్తున్న మనస్పర్ధలు విడుకాలకు దారితీస్తున్నాయి. తద్వారా వివాహాలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. అయితే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనస్పర్ధలు

సోమవారం, 5 జూన్ 2017 (21:09 IST)
సమాజంలో వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. భార్యభర్తల మధ్య పాగా వేస్తున్న మనస్పర్ధలు విడుకాలకు దారితీస్తున్నాయి. తద్వారా వివాహాలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. అయితే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనస్పర్ధలు పెద్ద సమస్యలు కాబోవు. భర్త ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్యను ప్రేమతో పలకరించడం అలవాటుగా పెట్టుకోవాలి. 
 
ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు కంప్యూటర్ ముందుకు కూర్చోవడం, టీవీకి అతుక్కుపోవడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా భోజనం చేసే సమయంలోనూ, బెడ్ రూమ్‌లోనూ సెల్‌ఫోన్ వాడకపోవడం మంచిది. భార్యాభర్తల మధ్య ఏదయినా సమస్య వచ్చినప్పుడు వాదించుకోవడం వల్ల అది పెరుగుతుందే తప్ప తగ్గదు. అటువంటి సమయంలో ఇద్దరూ పోట్లాడడం మాని, అసలు సమస్య తీరే మార్గం కోసం అన్వేషించాలి.
 
ఉద్యోగాలు చేస్తూ, ఎన్నిపనులున్నా సరే ఇద్దరూ కలిసి ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలి. ఆర్ధికపరమైన ఇబ్బందులు, పనుల ఒత్తిళ్లు ఎన్నున్నా ఇద్దరూ శృంగారానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇద్దరి మధ్యా స్పష్టమైన భావవ్యక్తీకరణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 
భాగస్వామిలో ఏదైనా ప్రత్యేకతను గమనించినట్లైతే దాన్ని ప్రశంసించేందుకు ఎప్పుడూ వెనకాడకండి. ఎదుటివాళ్లలో వచ్చిన ఏ మంచి మార్పు అయినా సరే గుర్తించాలి, అభినందించాలి. మీ భాగస్వామిని ఎవరికైనా పరిచయం చేస్తున్నప్పుడు కేవలం పేరూ, ఉద్యోగం కాకుండా ప్రత్యేకతలుంటే వాటిని కూడా చెప్పాలి. తద్వారా ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో తరచు నవ్వు తెప్పించే వీడియోలు, టీవీ ప్రోగ్రామ్‌లు చూడటం, పుస్తకాలు చదవడానికి చేయండి. ఇలా ఇద్దరూ కలిసి నవ్వడం వలన భార్యాభర్తలు ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

అన్నీ చూడండి

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments