Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళదుంప జ్యూస్‌తో ఇలా చేస్తే..?

Updated: సోమవారం, 18 మార్చి 2019 (15:03 IST)
ముఖ అందాన్ని రెట్టింపు చేసేది కళ్లు. అయితే కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు అందానికి అడ్డంగా మారుతాయి. కనీసం 10 మందిలో ఆరుగురికి ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్య సమస్యల కారణంగా ఈ నల్లని వలయాలు వస్తుంటాయి. ఈ వలయాలు తొలగించాలంటే.. ఇంట్లోని సహజసిద్ధమైన పదార్థాలతో మాయం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
 
స్పూన్ గ్రీన్ టీలో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి కళ్లకు మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే కళ్ల కింద నల్లటి వలయాలు క్రమేనా తగ్గుముఖం పడుతాయి. అలానే కొన్ని చుక్కల గ్లిసరిన్‌లో కొద్దిగా నారింజ రసాన్ని కలిపి కంటి కింద రాసుకోవాలి. ఆపై 20 నిమిషాల తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన నల్లని వలయాలే కాదు.. కళ్లు కూడా కాంతివంతంగా కనిపిస్తాయి.
 
పచ్చి బంగాళ దుంపతో జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌ను నల్లటి వలయాలకు రాసుకుంటే ఫలితం ఉంటుంది. బంగాళదుంపలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కంటిచూపును మెరుగుపరచడంలో దీనికి మించిన మరో వైద్యం లేదు. కనుక తప్పక బంగాళదుంపను వాడడండి. 
 
కళ్ల కింద నల్ల వలయాలను మాయం చేయడంలో దోసకాయ బాగా పనిచేస్తుంది. దోసకాయ ముక్కలను ఫ్రిజ్‌లో 30 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత వాటిని కళ్లపై పెట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత తీసి చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది. 

అన్నీ చూడండి

మెడలో తాళి కడుతుండగా ఆపండి అంటూ పెళ్లిపీటల పైనుంచి లేచిన వధువు

రిటైర్మెంట్ డబ్బు ఇవ్వనన్నందుకు భర్తను రోకలి బండతో కొట్టి చంపేసిన భార్య

Pawan Kalyan: సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్న పవన్ కల్యాణ్

చేపల వేట కోసం సముద్రంలోకి మత్స్యకారులు.. 14 రోజులు గడిచినా రాలేదు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలకు అలెర్ట్

అన్నీ చూడండి

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

హైదరాబాద్ బస్తీని అద్బుతంగా చూపించాలనుకున్నా : రమణా రెడ్డి సోమ

Ram Pothineni : రామ్ పోతినేని నటుడిగా-దర్శకుడిగా 24 గంటలు చిత్రీకరణ

Sriram: రివర్స్ టీజర్ తో ఆకట్టుకున్న ది మేజ్ చిత్రం

Sunil: కలలు నిజమైతే నిజం ఎవరిది. అనే పాయింట్ తో ఫైట్ మహా ట్రైలర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments