నేత్రాల అందాన్ని రెట్టింపు చేయాలంటే..?
ప్రతి జీవికి నేత్రం ఎంతో ముఖ్యం. నేత్రాలు లేకుంటే అందమైన సృష్టిని చూడలేం. మనిషికి నేత్రాలు ఎంత ముఖ్యమో.. వాటి పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. వీటి పరిరక్షణ కోసం కొన్ని చిట్కాలు...
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మంచి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ముఖం కడుక్కునేటప్పుడు ఎవరి తువ్వాలును వారే ఉపయోగించాలి. మండుటెండ, దుమ్ము, పొగనుండి కళ్ళను కాపాడుకోవాలి. సూర్య గ్రహణాన్ని చూడాలనుకునేవారు నల్లటి కళ్ళజోడును తప్పనిసరిగా ధరించాలి.
పుస్తకం చదువుతున్నప్పుడు పుస్తకాన్ని కంటి నుండి ఒకటిన్నర అడుగు దూరం ఉంచి చదవాలి. ఎడమచేతి పక్కనుండి వెలుతురు పడేలా చూడాలి. మసక వెలుతురులోనూ, జారగిలపడినప్పుడు, ఆనుకున్నప్పుడు పుస్తకం చదవరాదు. తక్కువ వెలుతురులో కనీసం 10 అడుగుల దూరంగా ఉండే టెలివిజన్ చూడాలి.
విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న బచ్చలికూర వంటి ఆకుకూరలను, ఆప్రికాట్ లాంటి రేగు పండు, జాతి పండ్లు, క్యారెట్స్, పాలు, వెన్న, చేప కాలేయం నూనె, గుడ్డులోని పచ్చసొన వంటివి ఎక్కువగా తింటే నేత్రాలు ఆరోగ్యంగా ఉంటాయి.