మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-04-2021 సోమవారం దినఫలాలు - శారదాదేవిని పూజించినా స్థిరబుద్ధి

మేషం : దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంగారు, వెండి, వస్త్ర వ్యాపార రంగాల వారికి మెళకువ అవసరం. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. చేతి వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. 
 
వృషభం : వైద్యులు, ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు మంచిదికాదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరీ, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
మిథునం : ఆలయం సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతుంది. విద్యార్థులకు సంతృప్తి కానవస్తుంది. ఎల్ఐసీ ఏజెంట్లకు, బ్రోకర్లకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందుల ఎదురయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి అధికం. గృహ నిర్మాణాలు, మరమ్మతులలో వ్యయం అధికం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ద వహించండి. స్త్రీలకు అయిన వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. 
 
సింహం : ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం అందటంతో మానసికంగా కుదుటపడతారు. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. విదేశీ వ్యవహారాలు, విద్య, రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించండి. 
 
కన్య : కొత్తపనులు ప్రారంభించడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే  వాయిదాపడతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
తుల : మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. విదేయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ఉమ్మడి కుటుంబ విషయాలలో మాట పడాల్సి వస్తుంది. 
 
వృశ్చికం : దైవ, సేవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తితో పాటు ధనం అధికంగా వెచ్చిస్తారు. బీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయ విక్రయాలు చిక్కుల్లో ఎదురవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. 
 
ధనస్సు : ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. బంధువుల మధ్య అనురాగ్య వాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. 
 
మకరం : రియల్ ఎస్టేట్ వ్యాపారుకు ఒత్తిడి తప్పదు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. లాయర్లకు చికాకులు తప్పవు. ఆడిటర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వల్ల దేనిలోనూ ఏకాగ్రత వహించలేరు. ఇతరుల దైవ సేవా కార్యక్రమాలలో మీపట్ల ఆకర్షితులవుతారు. 
 
కుంభం : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వృత్తుల వారికి సదావకాశాలు, ప్రజా సంబంధాలు బలపడతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సహకార సంఘాలలో వారికి రాజకీయాలలో వారికి చికాకు తప్పదు. 
 
మీనం : ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. దీర్ఘకాలిక రుణాలను తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. బంధు మిత్రులతో పట్టింపులెదుర్కొంటారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.