మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-04-2021 శనివారం దినఫలాలు - ధన్వంతరీని ఆరాధించినా...

మేషం : బంధు మిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాకపోవచ్చు. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాల పట్ల మెళకువ వహించండి. 
 
వృషభం : పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సంత్సంబందాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొత్త రుణాలు కోసం యత్నిస్తారు. వాహనం నపుడుతున్నపుడు మెళకువ అవసరం. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. 
 
మిథునం : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. మీ మిత్రుల కోసం బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. స్త్రీలు, గృహోపకరణ, విలాస వస్తువుల పట్ల ఆసక్తి కనపరుస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
కర్కాటకం : మీ విలాసాలకు సంతోషాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. ప్రేమికులకు ఎబడాటు చికాకులు తప్పవు. గృహంలో మరమ్మతులు, మార్పులు చేపడుతారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
సింహం : వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ మాటతీరు ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలు మీరే సమీక్షించుకోవడం క్షేమదాయకం. వాహన చోదకులకు మెళకువ వహించండి. ఇతరులకు ధనం ఇచ్చి తిరిగి రాబట్టుకోవడం సాధ్యం కాదని గమనించండి. 
 
కన్య : ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. దుబారా ఖర్చులు నివారించగలుగుతారు. గత తప్పిదాలు. పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. వాహనచోదకులకు మెళకువ వహించండి. స్త్రీలపై చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. 
 
తుల : రాజకీయ కళా రంగాల వారికి అనుకూలం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపడుతారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్తాలికమేనని గ్రహించండి. 
 
వృశ్చికం : దైవ, సేవా కార్యక్రమాలలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. మీ బలహీనతలు, అలవాట్లు, అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
ధనస్సు : విద్యార్థులు క్రీడా రంగాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మకరం : ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. చేస్తున్న పనిపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. పెద్దలను ప్రముఖులను కలుసుకోగలగుతారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
కుంభం : వృత్తి, ఉద్యోగ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇతరులతో మాట్లాడేటపుడు మనస్సు విప్పి మాట్లాడండి. ఆత్మీయులతో వేడుకలు, వినోదాలలో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. స్త్రీల, షాపింగ్‌లోనూ అప్రమత్తత అవసరం.
 
మీనం : రాజకీయ, కళారంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు ఆచి, తూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. ఏ పనైనా మొదలుపెట్టేముందు అన్ని రకాలుగా ఆలోచించండి. పాత రుణాలు తీరుస్తారు.