మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-04-2021 మంగళవారం దినఫలాలు - లక్ష్మీ స్త్రోత్రం పఠిస్తే...

మేషం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కొత్త వ్యక్తుల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృషభం : మీ ప్రియతముల పట్ల ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగును. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఇంటా, బయట కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
మిథునం : సిమెంట్ స్టాకిస్టులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కర్కాటకం : స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రావలసిన ధనం కొంతముందు వెనుకలుగానైనా అందుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుట మంచిది. బంధు మిత్రుల కలయిక మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. 
 
సింహం : వ్యాపారాలు ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
కన్య : అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మత్స్యు, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. దైవ, కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. 
 
తుల : స్త్రీలు, విందు, వినోదాలలో చురుకుగా వ్యవహరించి పలువురిని ఆకట్టుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతిపథంలో కొనసాగుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం : రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు స్త్రీల వాక్ చాతుర్యానికి, తెలివి తేటలకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఎటువంటి సమస్యలైనా ధీటుగా ఎదుర్కొంటారు. గృహంలో ఒక శుభకార్యం సానుకూలమవుతుంది. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే అస్కారం ఉంది. 
 
ధనస్సు : వస్త్ర, బంగారం వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోటల్, క్యాటరింగ్ పనివారికి కలిసిరాగలదు. రుణ యత్నాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
మకరం : పాత మిత్రులతో కలిసి విందు వినోదాలలో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. 
 
కుంభం : గృహానికి కావలసిన వస్తువులు కొంటారు. ఆత్మీయులను విస్మరించుట వల్ల సమస్యలు తలెత్తుతాయి. నిత్యావసర వస్తు ధరలు అధికమవుతాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం : మధ్యవర్తిత్వం వహించుట వల్ల మంచిది కాదు. విదేశాలు వెళ్ళేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకం సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి.