ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-05-2021- ఆదివారం మీ రాశి ఫలితాలు- నవగ్రహ శ్లోకం చదివినా...?

నవగ్రహ శ్లోకం చదివినా లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం: బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి తప్పదు. ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం వుంది. మరమ్మతులు అనుకూలిస్తాయి.
 
వృషభం: స్త్రీలకు, వస్త్ర, ఆకస్మిక ధన లాభం వంటి శుభపరిణామాలున్నాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మిత్రులను కలుసుకుంటారు. 
 
మిథునం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. సిమెంట్, ఐరన్, కలప వ్యాపారులకు లాభదాయకం. భాగస్వామికులతో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.
 
కర్కాటకం: ఔషధ సేవనం తప్పదు. ఆడిటర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు రాణిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల్లో వారికి ఆశాజనకం. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు శుభదాయకం. 
 
సింహం: వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
 
కన్య: ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో వుంచుకోవడం మంచిది. ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. 
 
తుల: ఆస్తి పంపకాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దూర ప్రయాణాల్లో మెలకువ వహించండి. కలప, ఐరన్ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. 
 
 
వృశ్చికం: ఆర్థిక ఇబ్బంది ఏంటూ ఏదీ వుండదు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి కలిసి రాగలదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మెళకువ అవసరం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో ఆందోళన అధికమవుతుంది. విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కానరాగలదు. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ఆశాజనకం.
 
ధనస్సు: రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కీలక సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. వేడుకలు, వినోదాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ది. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. రావలసిన ధనం అందుకుంటారు. 
 
మకరం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించాల్సి వుంటుంది. 
 
కుంభం: నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. నూతన పెట్టుబడులు పెట్టునప్పుడు మెళకువ వహించండి. టెక్నికల్, లా, మెడికల్ విద్యార్థుల్లో నూతనోత్సాహం కానవస్తుంది. స్త్రీలు వస్త్రాలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనుకున్న చోటికి బదిలీలు వంటివి ఉంటాయి. 
 
మీనం: వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ముఖ్య విషయాల్లో భాగస్వామి సలహా పాటించడం మంచిది. పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. గృహాలవసరాలకు నిధులు సమకూర్చుకుంటారు.