శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-07-2021 దినఫలాలు - గణపతిని ఎర్రని పూలతో పూజించినా...

మేషం : వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. కుటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ కళత్ర మొండివైఖరి చికాకు పరుస్తుంది. 
 
వృషభం : మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. స్త్రీలకు నరాలు ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులెదుర్కొంటారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచన చేస్తారు. మీ అభిప్రాయాలు, భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
మిథునం : ఎగుమతి వ్యాపారులకు కలిసివచ్చేకాలం. ఓ మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. బ్యాంకు వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. విద్యార్థులు మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. 
 
కర్కాటకం : టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగంలో వారికి కలిసివచ్చే కాలం. ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. అవిశ్రాంతంగా శ్రమించడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం, పరిసరాలు ఆందోళన కలిగిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 
 
సింహం : కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయాలోని వారికి ఒక సమాచారం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. మీ కళత్ర విపరీత ధోరణి చికాకు పరుస్తుంది. 
 
కన్య : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ, వస్తు నాణ్యతలోనూ మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలకు హాజరవుతారు. ఇతరుల సలహా కంటే పొంత నిర్ణయాలే మేలని గమనించండి. దీర్ఘకాలంగా వాయిదాపడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు మార్పులపై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
తుల : ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలుక తమమాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. ఒక అవసరానికి ఉంచి ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారమారుకాగలవు. దంపతుల మధ్య సఖ్యత లోపం చికాకులు తలెత్తుతాయి. వ్యాపార భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
ధనస్సు : ఐరన్, సిమెంట్, కలప రంగాలలోని వారికి నిరుత్సాహం తప్పదు. ప్రింటింగ్ రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు పూర్తికాగలవు. 
 
మకరం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిడుకులు ఎదురైనా అధికమిస్తారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. 
 
కుంభం : రాజకీయ నాయలకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. మార్కెటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పవు. ముఖ్యులకు విలువైన కానుకలందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ది పొందాలని యత్నిస్తారు. 
 
మీనం : స్త్రీలకు విదేశీ వస్తువులు, అలంకరణలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకలకు తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఖర్చులు పెరిగినా ఆర్థిక స్థితిలో ఏమాత్రం లోటువుండదు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన ఫలితం దక్కుంది.