శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-07-2021 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధించినా...

మేషం : పట్టుదలతో యత్నిస్తేనే మొండి బాకీలు వసూలవుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. మీ శ్రీమతి సలహా పాటించడం శ్రేయస్కరం. ఇతరులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించండి. ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విషయం చిన్నదైనా తేలికగా కొట్టివేయడం మంచిదికాదు. 
 
వృషభం : ఏజెట్లు, బ్రోకర్లశ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు మీ ఆర్థిక స్థితికి ఆటంకంగా నిలుస్తాయి. వ్యాపారాల్లో అమలు చేసిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. స్థిరబుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు కుటుంబ పరిస్థితులు విసుగు కలిగిస్తాయి. 
 
మిథునం : వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయంలేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. అవసరానికి సహకరించని బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
కర్కాటకం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. దీర్ఘకాలిక పెట్టుడుల ఆలోచనలు వాయిదావేయడం మంచిది. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. 
 
సింహం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, పనిభారం. అదనపు బాధ్యతలు వంటి పరిణామాలుంటాయి. మీ సంతానానికి ఇంజనీరింగ్, వైద్య, న్యాయ కోర్సుల్లో అవకాశం లభిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం. 
 
కన్య : రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ఆలోచన ఫలించదు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. స్పెక్యులేషన్ నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు, బ్యాంకు పనులు, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో మెళకువ వహించండి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. 
 
తుల : పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సహకరం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : నమ్మిన వ్యక్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిదికాదు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారల కొరత, ఇతరాత్రా చికాకులు తప్పవు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. 
 
ధనస్సు : స్త్రీలకు షాపింగ్‌లోనూ, కొత్త వ్యక్తుల పట్ల మెళకువ అవరం. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. 
 
మకరం : విద్యార్థులు ఆందోళనలు, అల్లర్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. షేర్ల క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. 
 
కుంభం : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు అయినవారి ఆదరణ, వస్త్రప్రాప్తి, ఆహ్వానం వంటి శుభపరిణాలున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
మీనం : ఆర్థిక లావాదేవీలు ఊహించని విధంగా ఉంటాయి. సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆదారపడటం మంచిదికాదు. కంపెనీలకు అవసరమై నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతాయ. రావలసిన ధనం చేతికందడంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.