గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

astro11
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. కొత్తయత్నాలు మెదలుపెడుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. వాహనసౌఖ్యం, ధనలాభం ఉన్నాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కృషి ఫలిస్తుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి అతి చొరవ ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణం విరమించుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నిరుత్సాహం వీడి శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. చెల్లింపుల్లో అలసత్వం తగదు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. రావలసిన ధనం లౌక్యంగా రాబట్టుకోవాలి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. చర్చల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మనోధైర్యంతో అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఒత్తిడికి గురికావద్దు. ఉత్సాహంగా శ్రమించండి. ఖర్చులు ప్రయోజనకరం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. శుభకార్యం నిశ్చమవుతుంది. కొత్త పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆలయాలు సందర్శిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. మాటతీరుతో ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు సామాన్యం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. సలహాలు ఆశించవద్దు. వ్యతిరేకులు తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేయగల్గుతారు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతంది. ఉల్లాసంగా గడుపుతారు.