గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-11-2023 గురువారం రాశిఫలాలు - సాయిబాబాను పూజించిన సర్వదా శుభం...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బ|| పంచమి రా.11.13 మృగశిర ఉ.6.48 ప.వ.3.37 ల 5.18.
ఉ.దు. 9.49 ల 10. 35 ప. దు. 2.23 ల 3.09.
 
సాయిబాబాను పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ఎదుటివారిపై నిందారోపణ చేయటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
వృషభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
మిథునం :- ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో మధ్యవర్తిత్వం వహించుట మంచిది కాదని గమనించండి. స్నేహ పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలు ఎదుటివారి ప్రభావానికి లోనవుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి.
 
కర్కాటకం :- వ్యాపారస్తులకు అధికారుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. తొందరపడి వాగ్దానాలు చేసి ఇబ్బందులకు గురికాకండి. ఉద్యోగస్తులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రైవేటు సంస్థలలోని మార్పుల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
సింహం :- పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అవివాహితులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. విద్యార్ధినులకు తోటివారి కారణంగా ఒత్తిడి, చికాకులు తప్పవు. ఉమ్మడి వ్యవహారాలకు సంబంధించిన విషయాలు చర్చలు జరుపుతారు.
 
కన్య :- స్త్రీల మాట, పని తీరు ఇబ్బందులకు దారితీస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి.
 
తుల :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. విద్యార్థులు క్రీడలు పట్ల ఆసక్తి కనబరుస్తారు. ప్రియతముల రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం :- స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. మీ శ్రీమతి సలహ పాటించడం వల్ల ఒక సమస్య నుంచి బయటపడతారు. ఖర్చులు అధికమైనా సార్థకత ఉంటుంది.
 
ధనస్సు :- భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ముఖ్యమైన విషయాలలో చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
మకరం :- వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. పత్రిక, వార్తా సంస్థలలోని ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. చేపట్టిన పనులు వేగవంతం అవుతాయి. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
కుంభం :- మీ కళత్ర వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ విషయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. ప్రముఖులతో కీలకమైన వ్యవహరాలు సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయులకు మీ సమస్యలు తెలియచేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
 
మీనం :- తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. మీ సంతానం పై చదువులు, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధవహిస్తారు. వృత్తుల వారి శ్రమకు తగిన ఆదాయం, గౌరవం లభిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులెదర్కుంటారు.