మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-03-2023 తేదీ బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా..

Leo
సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం:- విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. రవాణా రంగాల వారికి అధికమైన ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో ముక్తసరిగా సంభాషిస్తారు. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి.
 
వృషభం :- చిన్నారుల, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులకు గురవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఉన్నతినిచూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి.
 
మిధునం:- పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, నిరుత్సాహం ఆందోళనలు వంటివి తప్పవు విదేశీయానం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
కర్కాటకం:- ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులు పురోభివృద్ధి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నూతన రుణాల కోసం అన్వేషణ మొదలు పెడతారు. స్త్రీలకు పనివారాలతో ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
సింహం:- మీకు దగ్గరగా ఉన్న. మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అనుకోనివిధంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రేమికులకు పెద్దల మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య:- తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమంకాదు. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. ముఖ్యల రాకతో మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
తుల:- అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సంకల్పం నెరవేరటానికి ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో బాగా రాణిస్తారు.
 
వృశ్చికం: - బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల కారణంగా పై అధికారులతో మాటపడతారు. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ చాలా అవసరం. స్త్రీ కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం.
 
ధనస్సు:- ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. ద్విచక్ర వాహనం పై దూరప్రయాణాలు క్షేమదాయకంకాదు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 
 
మకరం:- విదేశాలలోని వారికి వస్తు సామాగ్రి, విలువైన పత్రాలు అందజేస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఉదోగ్యస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యార్థినులకు తోటివారి కారణంగా ఇబ్బందులు తప్పవు.
 
కుంభం:- స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. నూనె, మిర్చి, కంది స్టాకిస్టు వ్యాపారస్తులకు అనుకూలింగానే ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి ఆశాజనకం. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మీనం:- వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొవలసివస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి.