శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (10:57 IST)

09-04-2023 - ఆదివారం రాశిఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా...

Aries
మేషం :- కుటింబీకులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాజీమార్గంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక ఇబ్బందులేవీ ఉండవు. బంధు మిత్రులు మీ నుంచి ధనసహాయం ఆశిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
వృషభం :- వేళతప్పి భోజనం చేయడం, శారీరక శ్రమవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఏ ప్రయత్నం కలిసిరాక పోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో లౌక్యం అవసరం.
 
మిథునం :- స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కుంటారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
కర్కాటకం :- మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. స్త్రీలు అపరిచితులతోమితంగా సంభాషించటం క్షేమదాయకం. కొబ్బరి, పండ్ల, పూల, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
సింహం :- విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. నిరుద్యోగులకు ప్రకటనలు, మధ్యవర్తుల విషయంలో అవగాహన ముఖ్యం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందుతుంది. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు.
 
తుల :- సొంతంగా వ్యాపారం చేయాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. రసాయన, ఆల్కహాల్, సుగంధద్రవ్య వ్యాపారులకు ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- వ్యవసాయదారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలకు ఆరోగ్యమలో తగు జాగ్రత్త అవసరం. ప్రముఖులను కలిసుకొని సంప్రదింపులు జరుపుతారు. బంధువుల రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి.
 
ధనస్సు :- దైవ సేవా కార్యక్రమాల పట్ల, వస్తువులపట్ల ఆశక్తి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
మకరం :- వస్త్ర, బంగారు, వెండి, వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టటంమంచిది. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. శ్రమాంనతర వ్యవహారాలు అనుకూలిస్తాయి. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం.
 
కుంభం :- దంపతుల మధ్య స్వల్ప చికాకులు, అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాలవారి శ్రమకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆడిటర్లకు పని భారం తగ్గడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం.
 
మీనం :- పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోనివారికి పని భారం పెరుగుతుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో కొత్త వారితో జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు.