గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-04-2023 తేదీ బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

astrolgy
మేషం :- ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. విదేశీ వ్యవహారాలు, విద్య, రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం అందటంతో మానసికంగా కుదుటపడతారు. 
 
వృషభం :- దైవ సేవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తితో పాటు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. బీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి.
 
మిథునం :- మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సహకార సంఘాలలో వారికి రాజకీయాలలో వారికి చికాకులు వంటివి తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వృత్తుల వారికి సదావకాశాలు, ప్రజాసంబంధాలు బలపడతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో ఒడిదొడుకులు వ్యవహరిస్తారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
సింహం :- బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉమ్మడి కుటుంబ విషయాలలో మాట పడాల్సి వస్తుంది. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు.
 
కన్య :- ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. రుణ బాధలు, దీర్ఘ కాలిక సమస్యలు క్రమేణా సర్దుకుంటాయి. కార్యసాధనలో అనుకూలత, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. సొంతంగా వ్యాపారం, సంస్థలు, పరిశ్రమలు నెలకొల్పాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగస్తుల బదిలీ యత్నాలు ఫలిస్తాయి.
 
తుల :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్య సమస్యలు తప్పవు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించి లబ్ది పొందుతారు. ప్రయాణాల్లో చికాకులు, ప్రయాసలు తప్పవు.
 
వృశ్చికం :- ఆస్తి వ్యవహరాల్లో సోదరులతో అవగాహన ఏర్పడుతుంది. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు.
 
ధనస్సు :- బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఏదైనా స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. చిన్న చిన్న సమస్యలెదురైనా పరిష్కరించుకుంటారు.
 
మకరం :- వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వ్యవహరాల్లో కుటుంబీకులతో ఏకాభిప్రాయం కుదరదు. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహోపకరణాలు, వాహనం సమకూర్చు కుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది.
 
కుంభం :- మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. సోదరులతో ఆస్తి విషయమై సంప్రదింపులు జరుపుతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అనుకూలం. దూరంగా ఉన్న ఆత్మీయులను కలుసుకోవాలనే కోరిక స్ఫురిస్తుంది. ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
మీనం :- కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.