ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-04-2023 తేదీ ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివితే శుభం...

Astrology
మేషం :- తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. సహోద్యోగులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ జీవితభాగస్వామి సలహా పాటించటం వల్ల మేలు చేకూరుతుంది.
 
వృషభం :- సమయానికి అవసరమైన వస్తువు కనిపించకపోవచ్చు. తీర్థ యాత్రలు ఉల్లాసాన్నిస్తాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం కావటంతో మానసికంగా కుదుటపడతారు. చిన్నారులు, ఆత్మీయులకు మీరందించిన కానుకలు సంతోషపరుస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.
 
మిథునం :- బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక అవగాహన ఏర్పడుతుంది. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. సమయానికి కావలసిన పత్రాలు, వస్తువులు కనిపించకపోవచ్చు. 
 
కర్కాటకం :- గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తా శ్రవణం. ఎలక్ట్రికల్, రంగాల వారికి లాభదాయకం. స్త్రీలకు ఆహ్వానాలు, వాహన యోగం వంటి ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది.
 
సింహం :- ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. వేళతప్పి భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.
 
కన్య :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో లౌక్యం అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఖర్చులు రాబడికి మించినా ఇబ్బందు లుండవు.
 
తుల :- నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు కలిసిరాగలదు. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. కష్టసమయంలో ఆత్మీయులు చేదోడు వాదోడుగా నిలుస్తారు. సంఘంలో మీమాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి.
 
వృశ్చికం :- అంతగా పరిచయం లేని వారికి ధన సహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. క్రీడా, కళా, సాంస్కృక రంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. దైవ కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. విలువైన వస్తువుల కోసం ధనం ఖర్చు చేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండట మంచిది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
మకరం :- ముందుచూపుతో వ్యవహరించుటమంచిది. ప్రముఖులను కలుసుకొని సంప్రదింపులు జరుపుతారు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం :- పెద్దల ఆరోగ్యం నిరుత్సాహపరుస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధువుల రాక వలన ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
మీనం :- గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబీకులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతిపథంలో కొనసాగుతాయి. స్త్రీలకు దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు.