శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-04-2023 తేదీ సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం..

Astrology
మేషం :- ప్రైవేటు సంస్థల్లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వటం మంచిది కాదు. సోదరీ, సోదరులమధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్త్రీలకు అయిన వారిని చూడాలనే కోరిక స్ఫురిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు హడావిడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు.
 
వృషభం :- విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికం. దంపతుల మధ్య అపార్థాలు తలెత్తుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవటం ఉత్తమం. బంధుత్వాల మధ్య ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులు తీరిపోతాయి.
 
మిథునం :- సొంతంగావ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమదాయకం. లాయర్లు ఆసాధ్యమనుకున్న కేసులను సునాయాసంగా గెలుపొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారులు చికాకులు తప్పవు. 
 
కర్కాటకం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించటంమంచిది.
 
సింహం :- మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది. కలిగిస్తుంది. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, విత్తన వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆర్ధికాభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం.
 
కన్య :- దైవ, సాంఘిక, సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనపరుస్తారు. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీల వాక్ చాతుర్యంనకు, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. రాజకీయాలకు సంభంధించిన ఆలోచనలు చుట్టు ముడతాయి.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్య సమస్యలు వంటి చికాకులు అధికమయ్యే అవకాశంఉంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ఏసీ కూలర్ మోకానిక రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. బంధువుల రాకపోకలవల్ల గృహంలో సందడి కానవస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెంపుడు జంతువులపట్ల మెళుకువ అవసరం.
 
ధనస్సు :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం :- ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. రాబడికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. వ్యాపారాభివృద్ధికై చేయుయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాట పై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
కుంభం :- చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. దైవ సేవా కార్యాక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ఒత్తిడి, చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.
 
మీనం :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా ఉండవు. దైవ కార్యాల నిమిత్తం ప్రయాణాలు చేయవలసివస్తుంది. కంది, మినుము, పెసర, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు మెలకువ అవసరం. మిత్రులుకూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు.