సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-12-2022 శనివారం దిన ఫలాలు - శ్రీరాముడిని పూజించిన శుభం...

astrolgy
మేషం :- బ్యాంకు వ్యావహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు బంధువుల రాక వల్ల పనులు వాయిదాపడతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సినిమా, కళా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృషభం :- మీ కళత్ర వైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ప్రధానం.
 
మిథునం :- పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మార్కెట్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతగా ఉండదు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. వ్యాపారాల్లో కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
కర్కాటకం :- ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. చిత్తశుద్ధితో మీరు చేసిన సహాయానికి, సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలమవుతుంది.
 
సింహం :- రాజకీయనాయకులు అధికారులతో సమావేశాలు, పర్యటనల్లో పాల్గొంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రతి విషయంలోను ఓర్పుతో వ్యవహరించాలి. రుణాలు తీరుస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చుచేస్తారు.
 
కన్య :- నూతన రుణాలకోసం అన్వేషిస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను మీ శ్రీమతికి సూచనప్రాయంగా తెలియజేయండి. ఉద్యోగ యత్నంలో బిడియం, భేషజం తగదు. దాన ధర్మాలు చేసి సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
తుల :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ప్రైవేటు సంస్థలలో వారికితోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు.
 
ధనస్సు :- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారునుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగాఉంటాయి.
 
మకరం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం :- స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
మీనం :- సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఆడిటర్లకు, అక్కౌంటెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. రావలసిన మొండి బాకీలు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. మీ సాయంతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది.