సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-12-2022 గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా...

Raghavendra
మేషం :- కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది. ఉద్యోగస్తులకు ఏమరుపాటుతనం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలు మీ అంచనాలకు విరుద్ధంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో ఇబ్బందులు తప్పవు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
వృషభం :- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మీ పాత సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. మీ సంతానం ఆలోచనలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించండి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం.
 
మిథునం :- సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. చిన్ననాటిమిత్రుల కలయిక అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. కంది, మినుము, పెసర, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రేమికుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
కర్కాటకం:- రుణాలు, చేబదుళ్ళు తప్పవు. బ్యాంకింగ్ రంగాలవారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ కదలికలపై కొంతమంది నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుగుణంగా వచ్చే సూచనలున్నాయి. నూతన వ్యాపారాభివృద్ధికి చేయు పథకాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. 
 
సింహం :- ధనం సమయానికి సమకూరటం వల్ల మీలో నూతన ఉత్సాహం కానరాగలదు. మీ అశక్తతను కుటింబీకులు అర్ధం చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యాలు పెంపొందుతాయి. ముఖ్యుల సలహా పాటించడం మంచిదని గమనించగలరు.
 
కన్య :- చిన్న తరహా పరిశ్రమ, కుటీర పరిశ్రమల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. గృహంలో మార్పులు, చేర్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. విద్యుత్ రంగాల్లో వారు మాటపడతారు.
 
తుల :- సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. తినుబండారాలు, పండ్లు, బేకరి, వస్త్ర వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పుల వల్ల మాటపడతారు.
 
వృశ్చికం :- గృహంలో ఒక శుభకార్యం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఉత్తరప్రత్యుత్తరాలు సమర్ధంగా నిర్వహిస్తారు. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. కార్యసాధలో జయం, ప్రముఖులతో పరిచయాలు వంటి శుభపరిణామాలున్నాయి. వాహనం నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు అవసరం.
 
ధనస్సు :- తొందరపాటు నిర్ణయాలు, చర్యలు ఇబ్బందులకు దారితీస్తాయి. నిరుద్యోగులకు ఒక అవకాశం చేజారిపోయే అవకాశం ఉంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రైవేటు సంస్థల్లో వారినిర్లక్ష్య ధోరణి వల్ల మాటపడక తప్పదు.
 
మకరం :- వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు వస్త్రలాభం, ధనప్రాప్తి వంటి శుభపరిణామాలున్నాయి. క్రయ విక్రయ రంగాల్లో వారికి సామాన్యం. బంధువులతో చికాకులు తలెత్తుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ కళత్రమొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీల వాక్చాతుర్యానికి, ప్రతిభకు గుర్తింపు లభించగలదు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తుతాయి.
 
మీనం :- మీ ముఖ్యుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. .