1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఏ విషయాన్నీ తేలిగా తీసుకోవద్దు. సంప్రదింపులతో తీరిక ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమర్ధతను ఎదుటివారు గుర్తిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రియతములతో సంభాషిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. అనవసర జోక్యం తగదు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతి సాయం అందిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ప్రయాణలో అవస్థలెదుర్కుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అధికం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అననవసర విషయాలు పట్టించుకతోవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఏకపక్ష నిర్ణయం తగదు. ఖర్చులు సామాన్యం. కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ శ్రీమతి వైఖరీలో మార్పు వస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవకాశం చేజారిపోతుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి అధికం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. వెండి, బంగారం కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. పనుల ప్రారంభంలో చికాకులు తలెత్తుతాయి. కొత్త ప్రదేశం సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహార జయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. ఆప్తులకు సాయం అందిస్తారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనులు బాధ్యతలు అప్పగించవద్దు. మీ జోక్యం అనివార్యం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.