ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-06-2023 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం..

Pisces
మేషం :- ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసికాందోళనలు వంటివి ఎదుర్కొంటారు. 
 
వృషభం :- చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కళ్ళు, నడుము నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకుపురోభివృద్ధి.
 
మిథునం :- వ్యాపారాల అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యారంగంలోని వారికి నూతన ఉత్సాహం, పురోభివృద్ధి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- విద్యుత్, ఎ.సి. కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. రాతకోతలు, ప్రయాణాలు లాభిచక పోవచ్చు. వ్యాపార విషయాల్లో ఏకాగ్రత అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించటంమంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
సింహం :- ఉద్యోగస్తుల సమర్ధత, చాకచక్యానికి అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రైవేటుసంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళనచెందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో కురుకుగా పాల్గొంటారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలుపొందుతారు.
 
కన్య :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. స్థిరాస్తులు, వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
తుల :- విందులు, వినోదాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగంచేసుకోండి. వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. మీ సంతానం కోసం ధనం అధికంగావెచ్చిస్తారు.
 
వృశ్చికం :- భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తుతాయి.
 
ధనస్సు :- అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మకరం :- కోర్టు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రదేశ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. షాపుల మార్పుతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు.
 
కుంభం :- రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ పిలుపు అందుతుంది. మీ కళత్రం మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కార్యసాధనలో లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినివ్వజాలవు. స్త్రీలకు అధిక శ్రమ, ఆందోళన వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మీనం :- మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఎప్పటి సమస్యలను అప్పుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు.