సోమవారం, 11 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-09-2024 శుక్రవారం దినఫలితాలు : విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు...

astrolgy
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మనోధైర్యం పెంపొందుతుంది. కృషిలో లోపం లేకుండా చూసుకోండి. సహాయ సహకారాలు ఆశించవద్దు. మీ శ్రీమతి వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
బంధుమిత్రులతో సంభాషిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు పురమాయించవద్దు. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులతో మితంగా మాట్లాడండి. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. రుణ సమస్యలు తొలగుతాయి. తాకట్టును వెంటనే విడిపించుకోండి. ఏ విషయంలోను తాత్సారం తగదు. ఖర్చులు తగ్గించుకుంటారు. సంతానం కృషి ఫలిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, అధికారులకు హోదామార్పు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పనులు త్వరితగతిన పూర్తి కాగలవు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. కీలకపత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సన్నిహితులు సాయం అందిస్తారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మాట నిలబెట్టుకుంటారు. మీ నిజాయితీ అందరినీ ఆకట్టుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
చేపట్టిన పనుల్లో ఊహించని ఫలితాలుంటాయి. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల ప్రశంసలందుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు కొత్త బాధ్యతలు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏది జరిగినా ఒకందుకు మంచికే. ధైర్యంగా అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఖర్చులు తగ్గించుకోండి. మీ జోక్యం అనివార్యం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.