గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-09-2024 మంగళవారం దినఫలితాలు : శకునాలు పట్టించుకోవద్దు...

astrolgy
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరిరాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. శకునాలు పట్టించుకోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సముచిత నిర్ణయం తీసుకుంటారు. లక్ష్యం నెరవేరుతుంది. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. స్నేహసంబంధాలు అధికమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అనవసర జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆశించిన పదవులు దక్కవు. సమయస్పూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం దూకుడు అదుపుచేయండి. నిరుద్యోగులకు శుభయోగం. వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చాకచక్యంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఆప్తులను దైవకార్యం, విందులకు ఆహ్వానిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు, పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం యత్నాలు ఫలిస్తాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆప్తులకు మీ సమస్యలను తెలియజేయండి. దంపతుల మధ్య అకారణ కలహం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణ సమస్యలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పనులు, కార్యక్రమాలు సాగవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆత్మీయుల వ్యాఖ్యలకు స్పందిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పరిచయస్తుల మాటతీరు చికాకుపరుస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
స్నేహసంబంధాలు బలపడతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. మొండిధైర్యంతో వ్యవహరించండి. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది.