ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-09-2024 ఆదివారం దినఫలితాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఏ పనీ చేయబుద్ధి కాదు. బంధుమిత్రుల కోసం విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆహ్వానం అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఆలోచనలతో సతమతమవుతారు. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. చేతివృత్తులు, కార్మికులకు ఆశాజనకం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
విజ్ఞతతో వ్యవహరిస్తారు. మీ పెద్దరికానికి గౌరవం లభిస్తుంది. ఖర్చులు అధికం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కుంటారు. సన్నిహితులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనులు సానుకూలమవుతాయి. విందులకు హాజరవుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
కీలక చర్చల్లో పాల్గొంటారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
స్వయంకృషితో కార్యం సాధిస్తారు. మీ సామార్థ్యంపై నమ్మకం కలుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆలోచనలతో సతమతమవుతారు. దంపతుల మధ్య చీటికిమాటికి తగవులు. ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసనన్నం చేసుకుంటారు. అధికారులకు హోదా మార్పు, ఆకస్మిక స్థానచలనం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహార దక్షతతో రాణిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఆడంబరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. స్నేహసంబంధాలు బలపడతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పనులు పురమాయించవద్దు. స్వశక్తిపైనే ఆధారపడండి. రావలసిన ధనం అందదు. ఖర్చులు తగ్గించుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆధ్మాతికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. సంకల్పబలమే కార్యోన్ముఖులను చేస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఖర్చులు సామాన్యం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన వ్యవహారాలతో తలమునకలవుతారు. అకాలభోజనం, విశ్రాంతి లోపం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. ప్రియతములతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
విజ్ఞతతో వ్యవహరిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యకార్యంలో పొల్గొంటారు.