ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

astro1
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ త్రయోదశి రా.12.46 ఉత్తర సా.5.02 రా.వ.2.18 ల 4.04. సా.దు. 4.31 ల 5.20.
 
మేషం :- కుటుంబీకుతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. గొట్టె, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలలో వారికి ఆందోళనలు తొలగిపోతాయి. స్త్రీలు షాపింగ్ దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాలవారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మిథునం :- మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి. అనవసరపు విషయాలలో ఉద్రేకం మాని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి. విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తిచూపుతారు.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాలలో స్వల్ప ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. పొగడ్తలకు పొంగిపోవద్దు. తొందరపడి వాగ్దానాలు చేయటం మంచిది కాదని గమనించండి.
 
సింహం :- స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. పాత వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య పరస్పర అవగాహన తలెత్తుట వలన సమస్యలు తప్పవు.
 
కన్య :- ఏసీ కూలర్ మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. దైవకార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
తుల :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
వృశ్చికం :- దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఏసీ కూలర్, ఇన్వర్టర్ వ్యాపారులకు లాభదాయకం. బంధువుల విషయంలో మీ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతాయి. ప్రముఖుల కలయికసాధ్యం కాకపోవచ్చు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
ధనస్సు :- మిత్రులు మీయత్నాలకు అండగా నిలుస్తారు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, విత్తన వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల యిబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్త్రీలకు రచనలు, సమాజ సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- గృహోపకరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బాగా నమ్మే వ్యక్తులే మిమ్ములను మోసం చేసే ఆస్కారం ఉంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. రుణయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. స్త్రీలకు నడుము, నరాలకు ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదురవుతాయి.
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. సజ్జన సాంగత్యం, ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. స్త్రీలకు అయిన వారిని చూడాలనే కోరిక స్ఫురిస్తుంది. గతంలో ఇచ్చిన హామీల వల్ల వర్తమానంలో ఇబ్బందులెదురవుతాయి. ప్రయాణాలు సజావుగా సాగినా లక్ష్యం నెరవేరదు.
 
మీనం :- శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవటం ఉత్తమం. స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి.