సోమవారం, 2 అక్టోబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-03-2023 తేదీ బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన...

Capricorn
మేషం :- బంధువులను కలుసుకుంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలకు ఎదురైన పోటీ ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్యం చికాకు పరుస్తాయి. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల హోదా పెరగటంతోపాటు కోరుకున్న చోటికి బదిలీ అనుకూలిస్తుంది. 
 
వృషభం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శుభదాయకం. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
మిథునం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహకరం. ధనవ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కర్కాటకం :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
సింహం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. నూతన టెండర్ల విషయంలో కాంట్రాక్టర్లకు పునరాలోచన అవసరం. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు.
 
కన్య :- వివాహ, ఉద్యోగయత్నాలు నెరవేరతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. రుణ యత్నాల్లో ప్రతికూలత లెదుర్కుంటారు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
 
తుల :- ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. స్త్రీలకు ఆరోగ్యపరంగా సమస్య ఎదుర్కోవలసి వస్తుంది. విదేశీ యానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ సంతానం కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. తరుచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. అవసరానికి రుణాలు సకాలంలో అందవు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
ధనస్సు :- కుటుంబీకులతో మనస్పర్థలు వంటివి అధికమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళనలు వంటివి తలెత్తుతాయి. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు.
 
మకరం :- స్త్రీలకు టీ.వీ చానెళ్ల నుంచి బహుమతులు, అవకాశాలు లభిస్తాయి. సోదరీ సోదరులతో ఏకీభవించలేకపోతారు. విద్యార్థులకు అధిక శ్రమ అవసరం. వాహనం మరమ్మతులకు గురవుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
 
కుంభం :- పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళుకువ అవసరం. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతిపథంలో కొనసాగుతాయి.
 
మీనం :- వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. మీ ఆశయం నెవవేరడానికి బాగా శ్రమిచవలసి వస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి.