1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-02-2024 శనివారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా మీ సంకల్పం...

Lord shiva
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ పూర్ణిమ సా.5.10 మఘ రా.9.45 ఉ.వ.8.33 ల 10.18.
ఉ. దు. 6.35 ల 8.06.

శంఖరుడిని పూజించినా మీ సంకల్పం నెరవేరుతుంది. 
 
మేషం :- రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకు లెదురవుతలాయి. శస్త్రచికిత్సల సంబంధంగా వైద్యరంగాల వారికి ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాస వస్తువుల పట్లమక్కువ పెరుగుతుంది. వ్యాపారాలల్లో చికాకులు తప్పవు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
వృషభం :- నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ సంతానం కోసం ధనంబాగా వ్యయం చేయవలసివస్తుంది. వాతావరణంలో మార్పుతో స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి.
 
మిథునం :- మీ శ్రీమతి సలహా పాటించి లబ్ధిపొందుతారు. రవాణా విషయంలో ఆచితూచి వ్యవహరించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులు తమ లక్ష్య సాధన పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తారు.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. పనులు ఎంతకీ పూర్తికాక విసుగు కలిగిస్తాయి. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తులు అధికారులకు కానుకలు అందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు.
 
సింహం :- ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. పాత రుణాలు తీరుస్తారు. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. వృత్తిపరంగా పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
కన్య :- బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు పునరావృతమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. పాత రుణాలు తీర్చడంతోపాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం.
 
తుల :- మీ శ్రీమతి మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు అధికం కావడం వల్ల ఆందోళన చెందుతారు. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. ఉద్యోగస్తుల కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
వృశ్చికం :- అవసరాలకు కావలసిన ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. నేడు అనుకూలించని అవకాశం రేపు కలిసిరాగలదు. సన్నిహితుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారులకు ఒడిదుడుకులు, అధికారుల తనిఖీలు అధికమవుతుంది. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారికి ఆందోళన అధికం. 
 
ధనస్సు :- ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. బంధు మిత్రుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగస్తులకు స్థానచలనం, బాధ్యతల మార్పు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదంచేస్తాయి. 
 
మకరం :- పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం క్షేమంకాదు. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్‌ను అధిగమిస్తారు. వాహనచోదకులకు మరమ్మతులు, జరిమానాలు తప్పవు.
 
కుంభం :- స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఊహించని సంఘటన ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. రుణాలు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పట్టుదలతో యత్నాలు సాగించండి, సత్ఫలితాలు లభిస్తాయి. షాపుల స్థల మార్పుతో మరింత అభివృద్ధి సాధ్యం. 
 
మీనం :- మీ ఆధిపత్యం అన్నిచోట్ల పనిచేయదని గమనించండి. ఆస్తి పంపకాల్లో దాయాదులతో విభేదిస్తారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడులు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆందోళన కలిగించిన సమస్య తేలికగా సమసిపోతుంది.