శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-05-2023 శనివారం రాశిఫలాలు - దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేసిని శుభం...

Astrology
మేషం :- కార్మికులకు విశ్రాంతి లోపం. కుటుంబ సౌఖ్యం కొంత తగ్గుతుందనే చెప్పవచ్చు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. క్లిష్ట సమయంలో బంధుమిత్రులు జారుకుంటారు. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అప్రమత్త అవసరం. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యత వల్ల మనస్సు నిలకడగా ఉండదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి
 
మిథునం :- రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవపట్టే ఆస్కారం ఉంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
కర్కాటకం :- సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఇన్వర్టర్, ఏసీ వ్యాపారస్తులకు శుభదాయకం. అపరిచితుల విషయంలో మెళకువ అవసరం. భాగస్వామికులతో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది.
 
సింహం :- ఆర్థికంగా మెరుగుపడతారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. హోదాలు, పదవీయోగాలు దక్కే సూచనలు ఉన్నాయి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి.
 
కన్య :- భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకం. కళారంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు. ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి.
 
తుల :- ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. పండ్లు, పూలు, చల్లనిపానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ప్రయాణాల్లోను, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
వృశ్చికం :- ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. సహోద్యోగులు, అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. చేతి వృత్తుల వారికి అనుకూలం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నూతన దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
ధనస్సు :- జాయింట్ వెంచర్లు, సంస్థల స్థాపనలకు అనుకూలం. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరికొంత కాలం వాయిదా వేయటం మంచిది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ధనప్రలోభం వల్ల అధికారులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
మకరం :- వైద్యుల తొందరపాటు తనం వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి లాభదాయకం. ఆకస్మికంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు.
 
కుంభం :- కాంట్రాక్టర్లు నిర్మాణపనుల్లో పనివారలతో లౌక్యంగా మెలగవలసి ఉంటుంది. ఖర్చులు ఇతరత్రా చెల్లింపులు అధికమవుతాయి. మీ సమస్య ఒకటి సానుకూలం కావటంతో మానసికంగా కుదుటపడతారు. వ్యాపార విస్తరణకు భాగస్వాములతో కలిసి నూతన పథకాలు రూపొందిస్తారు. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం :- ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థవంతగా నిర్వహిస్తారు. మీ సంకల్ప బలానికి సన్నిహితుల సహాయం తోడవుతుంది. మీ కుటుంబీకులు మీ మాటా, తీరును వ్యతిరేకిస్తారు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.