గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-07-2022 గురువారం దినఫలాలు - వినాయకుడిని గరికెతో ఆరాధించిన సంకల్పసిద్ధి...

Rishabham
మేషం :- ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహరాలు వాయిదాపడుట మంచిది. బంధు మిత్రులు ఒత్తిడి, మొహమాటాలకు గురిచేస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
వృషభం :- వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉన్నతస్థాయి వ్యక్తుల కలయికతో మీ పనులు సానకూనలమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మిథునం :- బ్యాంకు వ్యవహారాలలో హామీలు, మధ్యవర్తిత్వాలు చికాకు పరుస్తాయి. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. క్రయ విక్రయాలు మందకొడిగా ఉంటాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.
 
కర్కాటకం :- విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేతివృత్తుల వారి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు.
 
సింహం :- వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. దైవకార్యాలకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తారు. శ్రమాధిక్యత, మానసికాందోళనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. పూలు, పండ్లు, కొబ్బరి వ్యాపారులకు కలిసివస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడి, కుటుంబంలో చికాకులు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధిపధకాల్లో నిలదొక్కుకుంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
తుల :- ఉద్యోగస్తులకు చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించటంతో ఆందోళన కలిగిస్తాయి. వ్యాపార, ఆర్ధికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి.
 
వృశ్చికం :- స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోవటంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
ధనస్సు :- చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. విదేశీ ప్రయాణాలకు సన్నిహితులు అన్నివిధాలా సహకారం అందిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు.
 
మకరం :- భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. కోర్టు, ఆస్తి వ్యవహరాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి.
 
కుంభం :- వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థానచలనంతోపాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందుతారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
 
మీనం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రతి విషయంలోను ఏకాగ్రత ముఖ్యం. మీ సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విషయంలోను మీ జీవితభాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలు దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం.