శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (09:15 IST)

14-04-22 గురువారం రాశిఫలాలు - కుబేరుడిని ఆరాధించిన సర్వదా శుభం...

astro3
మేషం :- భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం, తోటి వారి సహకారం లభిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. ఆడిటర్లు అసాధ్యమనుకున్న కేసులు సునాయాసంగా పరిష్కరిస్తారు.
 
వృషభం :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ అవసరం. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, నిత్యావసర వస్తు వ్యాపారులకు లాభం. రచయితలకు, పత్రికా, మీడియా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి.
 
మిథునం :- మీ చిన్నారుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. విదేశీ చదువులకై చేయు ప్రయత్నాలలో విజయం.
 
సింహం :- ఊహించని ఒత్తిడి, చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. దైవ సేవా కార్యాక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కన్య :- ఎ.సి. కూలర్, ఇన్వెర్టర్ల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు అధికం. మీ పథకాలు, ఆలోచలు కార్యరూపం దాల్చుతాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ప్రేమికులకు పెద్దల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఒక సిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు.
 
తుల :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతారు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఇతరులను అతిగా విశ్వసించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం :- భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. స్త్రీలు దైవకార్యక్రమాలలో అందరిని ఆకట్టుంటారు. వాహన చోదకులకు చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయాలవారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారు గమనించండి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు :- సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పాత వ్యవహారాలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. క్రీడా రంగాల వారికి చికాకుల తప్పవు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పుణ్యక్షేత్రాలు దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
మకరం :- అనురాగ వాత్సల్యాలు పొందగలవు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవహారంలో జాగ్రత్త అవసరం. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. 
 
కుంభం :- బంధువులతో రాక గృహంలో సందడి కానవస్తుంది. కాలం. సాంఘిక, దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వైద్య రంగాలలో వారికి శుభకార్యములకై చేయు యత్నాలు ఫలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలలో వారికి కలిసివచ్చే కాలం. ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి గురవుతారు.
 
మీనం :- రేషన్ డీలర్లు, ప్రభుత్వోద్యోగులకు చికాకులు తప్పవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రచయితలకు, పత్రికారంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులతో సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు.