ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-12-2021 శనివారం రాశిఫలాలు : వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం...

మేషం :- రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. శత్రువులు మిత్రులుగా మారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది.
 
వృషభం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఇంటా, బయట ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు.
 
మిధునం :- కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. వాహనం వీలైనంత నిదానంగా నడపటం మంచిది.
 
కర్కాటకం :- కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల నుంచి వేధింపులు అధికం. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
 
సింహం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు, ప్రముఖ సంస్థల షేర్ల విలువలు లాభాల బాటలో సాగుతాయి. దుబారా ఖర్చులు నివారించటంలో కుటుంబీకులు సహకరిస్తారు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ మాటను అందరూ గౌరవిస్తారు.
 
కన్య :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతి విషయంలోను జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎదటివారితో మితంగా సంభాషించటం ఉత్తమం. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ధనం మితంగా వ్యయం చేయటం మంచిది. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు.
 
తుల :- ఉద్యోగస్తులు, ప్రైవేటు సంస్థల్లో వారికి అధికారులతో అవగాహన కుదరదు. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. తొందరపాటు చర్యల వల్ల వ్యవహారం బెడిసికొట్టవచ్చు. వ్యాపారాల అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లోను, వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికంగా ఉంటుంది.
 
ధనస్సు :- స్త్రీలకు షాపింగ్ లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
 
మకరం :- ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మీపై శకునాలు, పెద్దల హితవు తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
కుంభం :- హోటల్, తినుబండారాలు, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల్లో శిక్షణావకాశం లభిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలవల్ల కష్టనష్టాలు ఎదుర్కుంటారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. మిత్రులను కలుసుకుంటారు.
 
మీనం :- స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తుల శక్తి సామార్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. బంధువుల ఆకస్మికరాక ఆశ్చర్యం కలిగిస్తుంది. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. మంచి మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.