ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-12-2021 మంగళవారం రాశిఫలాలు : ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల...

మేషం :- ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు తోటివారి సహాయం లభించదు. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది.
 
వృషభం :- కలప, ఐరన్, ఇటుక, సిమెంటు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఒప్పందాలు, కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. స్త్రీలు అపరిచిత వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
 
మిధునం :- రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు, ఆస్తి పంపకాలకు సంబంధించిన వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసి గుర్తింపు పొందుతారు.
 
కర్కాటకం :- వృత్తి, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి పై అధికారులను ఆకట్టుకుంటారు. స్త్రీలకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
సింహం :- అనుకున్న పనులు ఆశించినంత సంతృప్తికరంగా పూర్తి కావు. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి.
 
కన్య :- బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సేవా, పుణ్య కార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
తుల :- నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. స్త్రీలు గృహోపకరణాలు, విలాసవస్తువులు వంటివి అమర్చుకుంటారు. బంధుమిత్రులరాకతో గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించుకుంటాయి. అనవసర ఖర్చులు, సమయానికి రావలసిన ధనం అందకపోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినివ్వవు. భార్య, భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన స్త్రీలు వాటిని తెలివితో పరిష్కరిస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలెదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
ధనస్సు :- ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు తలెత్తుతాయి. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులకు, పనివారలకు సామాన్యం. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఖర్చులు పెరగటంతో రుణయత్నాలు చేస్తారు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. షేర్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు తోటి వారి నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఆడిటర్లకు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. వ్యవసాయ తోటల రంగాల వారికి ఆశాజనకం. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడితప్పదు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు.
 
మీనం :- రుణాలు తీర్చటానికి చేయు ప్రయాత్నాలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసివస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తాయి.