శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-12-2021 సోమవారం రాశిఫలాలు : శంకరుడిని పూజించినా మీ సంకల్పం

మేషం :- ఆర్థిక స్థితి కొంతమేరకు మెరుగుపడినా తాత్కాలిక ఇబ్బందులుంటాయి. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మవుతాయి. దైవ, శుభ కార్యాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు అమలు చేస్తారు. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారామవుతాయి.
 
వృషభం :- ఉద్యోగస్తులకు పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు అధికంగానే ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది.
 
మిథునం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు సానుకూలమవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి విదేశాలు వెళ్ళే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు తోటివారివల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- స్త్రీలు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. మీ మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. అర్థాంతరంగా నిలిపి వేసిన పునఃప్రారంభమవుతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. వాహనచోదకులకు ఆటంకాలు అధికమవుతాయి.
 
సింహం :- వస్త్ర, గృహోపకరణ వ్యాపారాలు సంతృప్తికరం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. మీ జీవితభాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. విద్యార్థినులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది.
 
కన్య :- ఉమ్మడి వ్యాపారాలు, నూతన వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగలుకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నతాన్ని గుర్తిస్తారు. తల పెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది.
 
వృశ్చికం :- ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
ధనస్సు :- ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. విద్యార్థునులలో ఏకాగ్రత లోపం, మందకొడితనం అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం శ్రేయస్కరం. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. ఇళ్ల స్థలాలు, పొలాల అమ్మకంలో పునరాలోచన మంచిది.
 
మకరం :- ఒక విషయంలో సోదరులు మీతో ఏకీభవించకపోవచ్చు. బంధువుల గురించి అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. రుణయత్నాల్లో అనుకూలత, చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.
 
కుంభం :- వాతావరణంలో మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో పునరాలోచన అవసరం. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
మీనం :- రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. సాహసకృత్యాలకు, వాదోపవాదాలకు ఇది సమయంకాదని గమనించండి. లోపాయికారిగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగినా తట్టుకుంటారు.