శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (10:10 IST)

19-12-2021 ఆదివారం రాశిఫలాలు : ఆదిత్య హృదయం చదివిన సర్వదా శుభం

మేషం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రవాణా రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. పెద్దలకు శుభాకాంక్షలు అందజేస్తారు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
వృషభం :- నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి పొందుతారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్ళ కోసం అన్వేషిస్తారు. 
 
మిథునం :- ఆర్థిక, ఆరోగ్య విషయాలలో సంతృప్తి కానవస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పథం బలపడుతుంది. సమయానికి చేతిలో ధనం లేకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీరు తలపెట్టిన పనులలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. మిత్రుల మాటతీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
సింహం :- స్త్రీల మీ శ్రమకు తగిన గుర్తింపు, రాణింపు, ప్రతిఫలం లభిస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి యత్నాలు సాగించిన సత్ఫలితాలు లభిస్తాయి. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి.
 
కన్య :- సన్నిహితుల సలహాలు, సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. విద్యార్థులకు క్రీడా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం వసూలు కాకపోవడంతో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. బంధువులతో ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
తుల :- ప్రముఖులతో తరచు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదురవుతాయి. మీ కదలికలపై కొంతమంది. నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. నూతన వ్యాపారాభివృద్ధికి చేయు పథకాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి.
 
వృశ్చికం :- స్త్రీలకు వస్త్ర, వస్తులాభం వంటి శుభఫలితాలుంటాయి. హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీమతి సలహా పాటించడంవల్ల ఒక సమస్య నుండి బయటపడతారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం మంచిది. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది.
 
ధనస్సు :- వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
 
మకరం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు షాపింగుల కోసం ధనం ఖర్చు చేస్తారు. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకుండి భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
కుంభం :- కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. స్థిరచరాస్తుల విషయంలో పునరాలోచన మంచిది. సంగీత, సాహిత్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. మీ పనులు మందకొడిగా సాగుతాయి.
 
మీనం :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. విందు వినోదాలలో పాల్గొంటారు.