సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-12-2021 శనివారం రాశిఫలాలు : రమాసమేత సత్యనారాయణస్వామిని...

మేషం :- దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. స్త్రీలకు ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. స్త్రీలలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
మిథునం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. మీ మాటకు కుటుంబలోను, సంఘంలోను గౌరవం లభిస్తుంది. పాత మిత్రుల కలయికతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
కర్కాటకం :- వ్యాపార విస్తరణ, పరిశ్రమల స్థాపనకు యత్నాలు చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. మిమ్ములను తక్కువ అంచనా వేసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు.
 
సింహం :- బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. నూతన ప్రదేశ సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. మీ సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలు విలువైన వస్తువులు చేజార్చుకునే ఆస్కారం ఉంది. పెద్దల ఆరోగ్యమ గురంచి ఆందోళన చెందుతారు.
 
కన్య :- ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఉద్యోగస్తుల ప్రతిభ, పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం.
 
తుల :- సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహన లోపం వంటివి ఉండగలవు. భాగస్వాముల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి.
 
వృశ్చికం :- స్త్రీలకు విలాసాలు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. లీజు, ఏజెస్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం.
 
ధనస్సు :- ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మకరం :- మొక్కుబడులు తీర్చుకోవాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. విందులు, దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కుంభం :- చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యం. విద్యార్థులు క్రీడలు, పోటీల్లో రాణిస్తారు. రాబడికి మించిన ఖర్చులు, రుణ ఒత్తిళ్ళు ఎదుర్కుంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. గృహ నిర్మాణం చురుకుగా సాగుతుంది. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
మీనం :- ఆత్మీయుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలలో భక్తిపరమైన ఆలోచనలు అధికమవుతాయి. వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. రుణయత్నాల్లో అనుకూలత, రావలసిన ధనం చేతికందటతో ఆర్థికంగా కుదుటపడతారు.