శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (19:58 IST)

20-03-2022 నుంచి 26-03-2022 వరకు మీ వార రాశిఫలాలు

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
కార్యానుకూలత ఉంది. మీ మాటకు ఎదురుండదు. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆది, మంగళవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సోమ, బుధవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. చేతివృత్తులు, కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఒత్తిళ్ళతో సతమతమవుతారు. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆది, మంగళ వారాల్లో ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్‌లో మెళకువ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. స్పెక్యులేషన్ నిరుత్సాహపరుస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
వ్యవహార నష్టం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలెదురవుతాయి. రావలసిన ధనం అందక సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. గురువారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. లాయర్లు, డాక్టర్లకు ఆదాయాభివృద్ధి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఆర్థికలావాదేవీలతో హడావుడిగా ఉంటారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. శుక్ర, శనివారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులను సంతోషపరుస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహ మరమ్మతులు చేపడతారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికతపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో చుక్కెదురవుతుంది. నిరుద్యోగులకు నిరాశాజనకం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఈ వారం శుభఫలితాలున్నాయి. మీప్రమేయంతో శుభకార్యం దిగ్విజయమవుతుంది. బంధుమిత్రులను ఆకట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు మోసగిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులకు పదోన్నతి, అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. పొగడ్తలకు పొంగిపోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో మెలకువ వహించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
కార్యానుకూలత ఉంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలను నమ్మొవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, మంగళవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
గ్రహాలు అనుకూలిస్తాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ఆదాయం అందుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. బుధవారం నాడు ఏ పనీ సాగదు. మీపై శకునాల ప్రభావం అధికం. ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. బిల్డర్లకు ఆశాజనకం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఆడిటర్లు, డాక్టర్లకు ఆదాయాభివృద్ధి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఖర్చులు అధికం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గురు, శుక్రవారాల్లో పనుల్లో అవాంతరాలెదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఇంటి విషయాలను పట్టించుకోండి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థికవ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. రావలసిన ఆదాయంలో కొంత మొత్తం అందుతుంది. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. పాత మిత్రులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉపాధి అవకాశాలు చేపడతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త, ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. యోగ, ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ప్రతికూలతలు తొలగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దుబారా ఖర్చులు విపరీతం. విలాసాలకు అతిగా వ్యయం చేస్తారు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో తెగిపోయిన బంధాలు బలపడతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.