గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 30 మే 2020 (19:31 IST)

01-06-2020 నుంచి 30-06-2020 వరకు మీ మాస ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం యోగదాయకం. కార్యసిద్ధి, ధనలాభం వున్నాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో మెలకువ వహించండి. సమస్యలు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనవసర జోక్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను తారసపడుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం. వృత్తుల వారికి ఆశాజనకం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. రాబడిపై దృష్టి పెడతారు. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిడి, ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ప్రతికూలతలు అధికం. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. ఖర్చులు విపరీతం పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. నగదు, పత్రాలు జాగ్రత్త. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. కొత్త సమస్యలెదురవుతాయి. సన్నిహితులను కలుసుకుంటారు. పెద్దల ప్రమేయంతో సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. అనుకూలతలు అంతంత మాత్రమే. ఓర్పుతో వ్యవహరించాలి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. మొహమ్మాటాలకు పోవద్దు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాల్లో ఒడిదుడుకులెదుర్కొంటారు.  ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. పొదుపు ధనం అందుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యవహారానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సన్నిహితుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఓర్పు, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రథమార్థం ప్రతికూలతలు అధికం. రుణ, గృహ సమస్యలు చికాకుపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనలాభం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట  
అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. బంధువుల వైఖరి అసనహం కలిగిస్తుంది. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఆదాయం సంతృప్తికరం. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలు చికాకు పరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికి మాటికీ అసహనం చెందుతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ప్రయాణం వాయిదా పడుతుంది. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్తులు భారమనిపించవు. వ్యవహారాలతో తీరిక వుండదు. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పంతాలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. ఊహించని సంఘటనలెదురవుతాయి. పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన కొరవడుతుంది. వాగ్వాదాలకు దిగవద్దు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు   
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. కార్యసిద్ధి, ధనలాభం వున్నాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ పెద్దరికానికి భంగం కలిగే సూచనలున్నాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పెట్టుబడులకు సమయం కాదు. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అధికారులకు హోదా మార్పు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వ్యవహారానుకూలత వుంది. అనుకున్నది సాధిస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహంలో స్తబ్ధత తొలగిపోతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపనకు సమయం కాదు. ఆరోగ్యం సంతృప్తికరం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతం నుంచి సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. యత్నాలు కొనసాగించండి. కార్యసాధనకు కృషి, పట్టుదల ప్రధానం. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సందేశాలు ప్రకటనలు విశ్వసించవద్దు. ప్రలోభాలకు దూరంగా ఉండాలి. అపరిచితులు మోసగించే ఆస్కారం వుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.